రణ్‌బీర్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన సినిమా తూ జూటీ మే మక్కర్. లవ్ రంజన్ దర్శకత్వం వహించారు. చాన్నాళ్ల తర్వాత రామ్‌కామ్‌కి హిందీలో మంచి ఆదరణ దక్కిందనే రివ్యూలు వచ్చాయి. వారం దాటిన తర్వాత కూడా రాక్ చేస్తోంది ఈ సినిమా అయితే తొలి తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు 82 కోట్లు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. అయితే, 100 కోట్ల క్లబ్‌లో కచ్చితంగా చేరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న బోళా విడుదలయ్యే వరకు థియేటర్లలో ఈ సినిమాకు పెద్ద కాంపిటిషన్ అయితే లేదు. ఓ వైపు పఠాన్ ఇంకా థియేటర్లలో ఉండటం వల్ల తూ జూటీకి చాలినన్ని థియేటర్లు దొరకలేదట.
మంచి థియేటర్లు పడి ఉంటే ఇప్పటికే 120 కోట్ల కలెక్షన్లు వచ్చేవన్నది మేకర్స్ మాట. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ సినిమా కలెక్షన్లు 3 మిలియన్లు దాటింది. ఆల్రెడీ ఓవర్సీస్ బిజినెస్ 5 మిలియన్లకు జరిగింది. మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేసిన కలెక్షన్లు 30 పర్సెంట్ డ్రాప్‌లో ఉన్నప్పటికీ, మౌత్ టాక్ మాత్రం బావుంది. ప్యాండమిక్ తర్వాత విడుదలైన సినిమాల్లో ఎనిమిదో పొజిషన్‌ని గానీ, తొమ్మిదో పొజిషన్‌ని గానీ ఈ చిత్రం హోల్డ్ చేస్తుందనే మాటలున్నాయి. పెళ్లి తర్వాత రణ్‌బీర్‌కి కలిసొస్తోంది. ఆలియాతో ఆయన ఫస్ట్ టైమ్ చేసిన బ్రహ్మాస్త్ర మంచి హిట్ అయింది. ఇప్పుడు తూ జూటీ మే మక్కర్‌కి కూడా చాలా మంచి స్పందన వస్తోంది.
తొలి రోజు 14.25 కోట్లు, రెండో రోజు 9.25కోట్లు, మూడో రోజు 9 కోట్లు, నాలుగో రోజు 14.5, ఐదో రోజు 14.25, ఆరో రోజు 5.40 కోట్లు, ఏడో రోజు 5.25 కోట్లు, ఎనిమిదో రోజు 4.70 కోట్లు, తొమ్మిదో రోజు 4.40 కోట్లు నెట్ కలెక్షన్లు తెచ్చుకుంది ఈ మూవీ. ఇందులో శ్రద్ధకపూర్ బికినీ డ్రస్సులకు ఫిదా అవుతున్నారు బాలీవుడ్ తంబిలు. రణ్‌బీర్ సినిమా సక్సెస్ అయినందుకు దగ్గరివారికి పార్టీ ఇచ్చారు ఆలియా.